Harbhajan Singh: మరోసారి క్షమాపణ కోరుతున్నా
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:34 AM
చెంపదెబ్బ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఎందుకంటూ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో శ్రీశాంత్ చెంపపై భజ్జీ కొట్టిన వీడియోను ఇటీవల లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విడుదల చేసిన...
చెంపదెబ్బ వీడియోపై హర్భజన్
న్యూఢిల్లీ: చెంపదెబ్బ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఎందుకంటూ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో శ్రీశాంత్ చెంపపై భజ్జీ కొట్టిన వీడియోను ఇటీవల లీగ్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘అందరూ మర్చిపోయిన ఆ విషయాన్ని గుర్తుకుతెస్తున్నారు. దీని వెనుక వారికేదైౖనా స్వార్థపూరిత ఉద్దేశం ఉండొచ్చు. అప్పటి నా ప్రవర్తనపై ఎన్నోసార్లు క్షమాపణ చెప్పా. ఇప్పటికీ బాధగానే ఉంది. వినాయకుడి సాక్షిగా మరోసారి క్షమించమని కోరుతున్నా’ అని భజ్జీ తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News