Andhra Premier League: విహారి ఆల్‌రౌండ్ షో
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:23 AM
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హనుమ విహారి (62 నాటౌట్, 2/32) ఆల్‌రౌండ్ షో ప్రదర్శిం చడంతో అమరావతి రాయల్స్..
ఏపీఎల్‌లో లయన్స్‌పై రాయల్స్ విజయం
విశాఖపట్నం-స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హనుమ విహారి (62 నాటౌట్, 2/32) ఆల్‌రౌండ్ షో ప్రదర్శిం చడంతో అమరావతి రాయల్స్ 7 వికెట్లతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై గెలిచింది. తొలుత లయన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులు చేసింది. వీరారెడ్డి (41), రోషన్ (30) మినహా ఎవరూ రాణించ లేదు. సందీప్ 3, విహారి, అయ్యప్ప, సంతోష్ తలా 2 వికెట్లు తీశారు. ఛేదనలో రాయల్స్ 15 ఓవర్లలో 140/3 స్కోరు చేసి నెగ్గింది. విహారికి తోడు ప్రణీత్ (44), ప్రసాద్ (21 నాటౌట్) అదరగొట్టారు. ఇక, వర్షం కారణంగా ఏడు ఓవర్లకు కుదించిన రెండో మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ 10 వికెట్ల తేడాతో కాకినాడ కింగ్స్‌ను ఓడించింది.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి