Share News

Asia Shooting Championships: గురుప్రీత్‌ గురి అదిరె

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:12 AM

ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో గుర్‌ప్రీత్‌ సింగ్‌ రెండు పసిడి పతకాలు కొల్లగొట్టాడు. జూనియర్‌ విభాగంలో తెలంగాణకు చెందిన మురళీధర్‌ నాయుడు స్వర్ణ, కాంస్యాలతో మెరిశాడు. 25మీ. స్టాండర్డ్‌ పిస్టల్‌ కేటగిరీ ఫైనల్లో...

Asia Shooting Championships: గురుప్రీత్‌ గురి అదిరె

రెండు స్వర్ణాలు కొల్లగొట్టిన భారత షూటర్‌

పసిడితో మెరిసిన మురళీధర్‌

ఆసియా చాంపియన్‌షిప్స్‌

షిమ్‌కెంట్‌ (కజకిస్థాన్‌): ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో గుర్‌ప్రీత్‌ సింగ్‌ రెండు పసిడి పతకాలు కొల్లగొట్టాడు. జూనియర్‌ విభాగంలో తెలంగాణకు చెందిన మురళీధర్‌ నాయుడు స్వర్ణ, కాంస్యాలతో మెరిశాడు. 25మీ. స్టాండర్డ్‌ పిస్టల్‌ కేటగిరీ ఫైనల్లో గురుప్రీత్‌ స్వర్ణం, అమన్‌ప్రీత్‌ రజతం అందుకున్నారు. ఇక గురుప్రీత్‌, అమన్‌ప్రీత్‌, హర్ష్‌ గుప్తాతో కూడిన భారత జట్టు 25 మీ. స్టాండర్డ్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం నెగ్గింది.

మురళీధర్‌ భళా..: జూనియర్‌ విభాగంలో మురళీధర్‌ నాయుడు రెండు పతకాలతో సత్తా చాటాడు. 25 మీ. స్టాండర్డ్‌ పిస్టల్‌ టీమ్‌ కేటగిరీలో మురళీధర్‌ నాయుడు, సూరజ్‌ శర్మ, ముకే్‌షతో కూడిన భారత త్రయం (1703 పాయింట్లు) స్వర్ణం చేజిక్కించుకుంది. ఇక 25 మీ. స్టాండర్డ్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మురళీధర్‌ (568) కాంస్యం నెగ్గాడు. జూనియర్‌ పురుషుల 50 మీ. రైఫిల్‌ ప్రోన్‌లో సమీవుల్లా, కర్మాకర్‌, కుశాగ్ర త్రయం పసిడి పతకాన్ని సాధించింది.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:12 AM