Share News

Chess World Rankings: ప్రజ్ఞానంద @ 4

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:42 AM

గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద కొత్త మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో అత్యధికంగా 2785 ఎలో రేటింగ్‌కు చేరాడు. దాంతో ఫిడే క్లాసికల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతడు అత్యుత్తమంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు...

Chess World Rankings: ప్రజ్ఞానంద @ 4

చెస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద కొత్త మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో అత్యధికంగా 2785 ఎలో రేటింగ్‌కు చేరాడు. దాంతో ఫిడే క్లాసికల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతడు అత్యుత్తమంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా అత్యుత్తమ ర్యాంక్‌ సాధించిన భారత ఆటగాడిగా మరో ఘనతనూ ప్రజ్ఞానంద అందుకున్నాడు. సింక్వెఫీల్డ్‌ కప్‌లో రన్నర్‌పగా నిలవడంతో ప్రజ్ఞానందకు ఆరు రేటింగ్‌ పాయింట్లు లభించాయి. కార్ల్‌సన్‌ టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, అమెరికన్‌ గ్రాండ్‌మాస్టర్లు నకముర, కరువాన రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. తెలంగాణ జీఎం అర్జున్‌ ఐదు, వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ ఆరో ర్యాంక్‌ దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 04:42 AM