Womens World Cup Cricket: గార్డ్‌నర్ శతక మోత
ABN , Publish Date - Oct 02 , 2025 | 06:27 AM
ఆష్లే గార్డ్‌నర్ (115) శతక పోరాటంతో.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 89 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. తొలుత ఆస్ట్రేలియా...
నేటి మ్యాచ్
పాకిస్తాన్ గీబంగ్లాదేశ్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
కివీ్‌సపై ఆసీస్ గెలుపుఫ మహిళల వన్డే వరల్డ్‌కప్
ఇండోర్: ఆష్లే గార్డ్‌నర్ (115) శతక పోరాటంతో.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 89 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. తొలుత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 326 రన్స్‌కు ఆలౌటైంది. జెస్ కెర్, తహుహు చెరో మూడు వి కెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఆసీస్ ప్రధాన బ్యాటర్లు విఫలం కావడంతో 129/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆష్లే అద్భుత భాగస్వామ్యాలతో ఆదుకుంది. లిచ్‌ఫీల్డ్ (45), ఎలీస్ (33) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో కివీస్ 43.2 ఓవర్లలో 237 పరుగులకే కుప్పకూలింది. సోఫీ డివైన్ (111) సెంచరీ వృథా అయింది. సదర్లాండ్, మోలినెక్స్ చెరో మూడు వికెట్లు దక్కించుకొన్నారు.
తొలి మ్యాచ్‌కు 23 వేల మంది..
గువహటి: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు రికార్డుస్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌కు 22,843 మంది హాజరైనట్టు ఐసీసీ తెలిపింది. మహిళల క్రికెట్‌లో ఓ గ్రూప్ మ్యాచ్‌కు ఇంత మంది రావడం రికార్డని పేర్కొంది. గతేడాది దుబాయ్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అత్యధికంగా 15,935 మంది హాజరయ్యారు. దీన్ని భారత్-లంక మ్యాచ్ అధిగమించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News