Roza Kozakowska Wins Gold: నిన్న ఆసుపత్రి బెడ్‌పై నేడు పోడియంపై
ABN , Publish Date - Oct 02 , 2025 | 06:23 AM
వాంతులు, వడదెబ్బ కారణంగా స్పృహ కోల్పోయిన దశలో మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరిన పోలెండ్ పారా అథ్లెట్ రొజా కొజాకొవోస్కా.. మరుసటిరోజే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో...
ప్రపంచ పారా అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: వాంతులు, వడదెబ్బ కారణంగా స్పృహ కోల్పోయిన దశలో మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరిన పోలెండ్ పారా అథ్లెట్ రొజా కొజాకొవోస్కా.. మరుసటిరోజే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో విజేతగా నిలిచి తన సంకల్ప బలాన్ని చాటింది. పూర్తి ఆరోగ్యంగా లేకున్నా, బుధవారం పోటీలకు వచ్చిన 36 ఏళ్ల రొజా.. మహిళల క్లబ్ త్రో ఎఫ్32 కేటగిరిలో ఏకంగా స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది.
నిరాశపరచిన తెలుగు అథ్లెట్ అకీరా
తెలుగు అథ్లెట్ అకీరా నందన్ బానోతుకు ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో నిరాశ ఎదురైంది. 400 మీటర్ల టీ38 కేటగిరిలో ఫైనల్ చేరిన ఈ తెలంగాణ కుర్రాడు.. పతక వేటలో విఫలమయ్యాడు. మొత్తం ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో అకీరా ఏడోస్థానానికి పరిమితమయ్యాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News