Share News

Ravichandran Ashwin: దుబాయ్‌ లీగ్‌లో అశ్విన్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:44 AM

తాజాగా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా మాజీ స్పిన్నర్‌ అశ్విన్‌ అంతర్జాతీయ లీగ్‌లు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. యూఏఈ నిర్వహించే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20) వేలంలో తనపేరును..

Ravichandran Ashwin: దుబాయ్‌ లీగ్‌లో అశ్విన్‌

న్యూఢిల్లీ: తాజాగా ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా మాజీ స్పిన్నర్‌ అశ్విన్‌ అంతర్జాతీయ లీగ్‌లు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. యూఏఈ నిర్వహించే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20) వేలంలో తనపేరును నమోదు చేసుకొనేందుకు నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్టు అశ్విన్‌ తెలిపాడు. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10 డెడ్‌లైన్‌. ఇంతకుముందు ఈ లీగ్‌లో డ్రాఫ్టింగ్‌ విధానం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా.. ఈ ఏడాది వేలం ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఈనెల 30న దుబాయ్‌లో వేలం జరగనుంది. లీగ్‌ను డిసెంబరు 2 నుంచి జనవరి 4 వరకు షెడ్యూల్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 04:44 AM