Womens World Cup: వైజాగ్‌లో పరుగుల వరదే
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:05 AM
మహిళల వరల్డ్‌క్‌పలోని గత రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. ఈ నేపథ్యంలో విశాఖలో బలమైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది...
భారత మ్యాచ్‌లకు ఫ్లాట్ వికెట్?
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): మహిళల వరల్డ్‌క్‌పలోని గత రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. ఈ నేపథ్యంలో విశాఖలో బలమైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. అయితే, కీలక మ్యాచ్‌లకు ఎలాంటి పిచ్‌ను తయారు చేస్తారోనన్న చర్చ జోరుగా సాగుతుంది. కానీ, విశాఖలో ఫ్లాట్ పిచ్‌ను తయారు చేశారన్న వార్త భారత బ్యాటర్లకు ఊరటనిచ్చేదే. శ్రీలంక, పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. కానీ, అదంతా బౌలర్ల ప్రతిభతోననే చెప్పుకోవాలి. బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేశారు. కానీ, బిగ్ మ్యాచ్‌లు కావడంతో హర్మన్, స్మృతి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకొంటున్నారు. ‘వికెట్ బ్యాటర్లకు అనుకూలం. గత కొన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే.. మంచు ప్రభావం లేకపోతే స్పిన్నర్లకు కొంత సహకారం లభించవచ్చు’ అని ఆంధ్ర క్రికెట్ సంఘం తెలిపింది. వైజాగ్‌లో 11 ఏళ్ల తర్వాత మహిళల వన్డే మ్యాచ్ జరుగుతోంది. 2014, జనవరి 23న ఇదే వేదికపై శ్రీలంకతో భారత్ తలపడింది.
విశాఖ చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా గురువారం భారత జట్టుతో తలపడనున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. సోమవారం ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News