Farhans Gun Firing Celebration: ఫర్హాన్ గన్ ఫైరింగ్
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:37 AM
హాఫ్ సెంచరీ చేసిన ఆనందంలో పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్ ప్రవర్తించిన తీరు నెట్టింట తీవ్ర విమర్శలపాలైంది. స్పిన్నర్ అక్షర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి...
సోషల్‌మీడియాలో విమర్శల వెల్లువ
హాఫ్ సెంచరీ చేసిన ఆనందంలో పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్ ప్రవర్తించిన తీరు నెట్టింట తీవ్ర విమర్శలపాలైంది. స్పిన్నర్ అక్షర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అర్ధ శతకం పూరించిన ఫర్హాన్.. గన్ ఫైరింగ్ చేస్తున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అయుతే కొద్ది నెలల కిందట పాకిస్థాన్ టెర్రరిస్టులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో..ఫర్హాన్ అలా తుపాకీ పేలుస్తున్నట్టు చేసిన సెలెబ్రేషన్‌పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంజేస్తున్నారు. తమ సోదరులు పహల్గామ్‌లో అలానే అమాయక ప్రజలను హతమార్చినట్టు ఫర్హాన్ చూపాడని నెటిజన్లు దుయ్యబడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి