Womens World Cup: ఇంగ్లండ్ కాస్త కష్టంగా
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:00 AM
మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండో విజయం అందుకుంది. అయితే...
నేటి మ్యాచ్
ఆస్ట్రేలియా X పాకిస్తాన్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
బంగ్లాదేశ్‌పై గెలుపు
మహిళల వన్డే వరల్డ్‌కప్
గువాహటి: మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా రెండో విజయం అందుకుంది. అయితే పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్‌ను బంగ్లా బౌలర్లు కొంతమేర కట్టడి చేయగలిగారు. కానీ హీథర్ నైట్ (79 నాటౌట్) అజేయ ఆటతీరుతో జట్టు గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. సోభన మోస్తరి (60), రబేయ (43), షర్మిన్ (30) రాణించారు. ఎకెల్‌స్టోన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. బ్రంట్ (32), డీన్ (27 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఆమీ జోన్స్ (1)ను అవుట్ చేసిన పేసర్ మరూఫ షాకిచ్చింది. ఆ తర్వాత తనే మరో ఓపెనర్ బ్యూమాంట్ (13) వికెట్‌ను కూడా తీసింది. ఇక స్పిన్నర్ ఫహిమా ధాటికి మధ్య ఓవర్లలో 78/5 స్కోరుతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో హీథర్ హాఫ్ సెంచరీతో ఏడో వికెట్‌కు డీన్‌తో అజేయంగా 80 పరుగులు జోడించడంతో ఎలాంటి సంచలనం లేకుండా మ్యాచ్ ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 49.4 ఓవర్లలో 178 ఆలౌట్. (సోభన 60, రబేయ ఖాన్ 43 నాటౌట్, షర్మీన్ 30; ఎకెల్‌స్టోన్ 3/24, డీన్ 2/28, కాప్సీ 2/31, లిన్సే స్మిత్ 2/33).
ఇంగ్లండ్: 46.1 ఓవర్లలో 182/6. (హీథర్ 79 నాటౌట్; బ్రంట్ 32, కాప్సీ 20, డీన్ 27 నాటౌట్; ఫహీమా 3/16, మరూఫా 2/28).
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News