India vs England: ఆఖరి వన్డే చేజారింది..
ABN , Publish Date - Jul 08 , 2025 | 02:40 AM
భారత్ అండర్-19 జట్టుతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో గెలుపొందింది..
యువ భారత్‌పై ఇంగ్లండ్ గెలుపు
వర్సెస్టర్: భారత్ అండర్-19 జట్టుతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే సొంతం చేసుకోగా..ఆధిక్యాన్ని 2-3కి ఆతిథ్య జట్టు తగ్గించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 210/9 స్కోరుకే పరిమితమైంది. అంబరీష్ (66) అర్థ శతకం చేయగా, వైభవ్ సూర్యవంశీ (33) మోస్తరుగా రాణించాడు. అలెక్స్, రాల్ఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్ అండర్-19 31.1 ఓవర్లలో 211/3 స్కోరు చేసి నెగ్గింది. బెన్ మాయెస్ (82 నాటౌట్), డాకిన్స్ (66) హాఫ్ సెంచరీలు సాధించారు. నమన్ పుష్కక్ రెండు వికెట్లు తీశాడు.