Duplantis World Record: డుప్లాంటిస్ 14వసారి
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:50 AM
స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ అర్మాండ్ డుప్లాంటిస్ 14వ సారి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో సోమవారం జరిగిన పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో డుప్లాంటిస్...
వరల్డ్ రికార్డు తిరగరాసిన పోల్‌వాల్ట్ స్టార్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స
టోక్యో: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ అర్మాండ్ డుప్లాంటిస్ 14వ సారి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో సోమవారం జరిగిన పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో డుప్లాంటిస్ మూడో, ఆఖరి ప్రయత్నంలో 6.30 మీటర్ల ఎత్తు దూకి మూడోసారి వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. ఈ క్రమంలో హంగేరిలో జరిగిన ఈవెంట్‌లో తన రికార్డు 6.29 మీటర్లను అధిగమించాడు. సోవియట్ యూనియన్ మాజీ పోల్‌వాల్టర్ సెర్గీ బుబ్కా 13 సార్లు ప్రపంచ రికార్డును తిరగరాశాడు. ఇప్పుడు డుప్లాంటిస్ అతడిని అధిగమించాడు.
మారథాన్‌లో ఫొటో ఫినిష్..: పురుషుల మారథాన్‌లో 100 మీ. తరహా ఫొటో ఫినిష్ ఔరా అనిపించింది. 42.195 కిలోమీటర్ల రేస్‌లో అల్ఫాన్సో ఫెలిక్స్ శింబు (టాంజానియా) 0.05 సెకన్ల తేడాతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. పెట్రోస్ (జర్మనీ-2 గంటల 09:48 సె) రజతం, అవాని (ఇటలీ-2:09:53) కాంస్యం దక్కించుకొన్నారు.
శ్రీశంకర్, తేజస్, పారుల్ విఫలం: భారత అథ్లెట్లు తీవ్రంగా నిరాశపర్చారు. లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. 3000 మీ. స్టీపుల్ ఛేజ్‌లో పారుల్ చౌదరి, అంకిత హీట్స్‌లోనే వెనుదిరగ్గా..110మీ. హర్డిల్స్‌లో తేజస్ షిర్సే సెమీ్‌సకు క్వాలిఫై కాలేకపోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News