National Junior Athletics Championship: ఆనంది శేషుకు కాంస్యాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:56 AM
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు దుడ్డు శేషు, నల్లవెల్లి ఆనంది కాంస్య పతకాలు కొల్లగొట్టారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు దుడ్డు శేషు, నల్లవెల్లి ఆనంది కాంస్య పతకాలు కొల్లగొట్టారు. భువనేశ్వర్‌లోని కళింగలో నాలుగు రోజులక్రితం మొదలైన ఈ పోటీలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు అండర్-18 విభాగం 200 మీటర్ల పరుగులో విశాఖపట్నం అథ్లెట్ శేషు 22.09 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానం దక్కించుకున్నాడు. అండర్-16 బాలికల 600 మీటర్ల పరుగులో పెద్దపల్లి అమ్మాయి ఆనంది ఒక నిమిషం 34.48 సెకన్లలో రేసును పూర్తి చేసి, తృతీయ స్థానంలో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News