Asian Shooting Championship: రెండు స్వర్ణాలూ మనవే
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:24 AM
ఆసియా చాంపియన్‌షి్‌ప సీనియర్, జూనియర్ విభాగాల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పీ సీనియర్, జూనియర్ విభాగాల స్వర్ణ పతకాలు రెండూ మనోళ్లే...
ఐశ్వరీ, అడ్రియన్‌కు టైటిళ్లు
ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప
షిమ్‌కెంట్ (కజకిస్థాన్): ఆసియా చాంపియన్‌షి్‌ప సీనియర్, జూనియర్ విభాగాల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పీ సీనియర్, జూనియర్ విభాగాల స్వర్ణ పతకాలు రెండూ మనోళ్లే కొల్లగొట్టారు. సీనియర్ పురుషుల 50 మీ. రైఫిల్ 3-పీ విభాగం తుది పోరులో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్ 462.5 పాయింట్లతో పసిడి అందుకున్నాడు. చైనా, జపాన్ రజత, కాంస్యాలు నెగ్గాయి. అంతకుముందు..ఐశ్వరీ ప్రతాప్, చెయిన్ సింగ్, షెరాన్ త్రయం 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ విభాగంలో రజత పతకం చేజిక్కించుకుంది. జూనియర్ పురుషుల 50 మీ. రైఫిల్ 3-పీ కేటగిరీ ఫైనల్లో అడ్రియన్ కర్మాకర్ (463.8) ఆసియా రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. హాన్ (చైనా) రజతం, వేదాంత్ నితిన్ (భారత్) కాంస్య పతకాలు సాధించారు. వేదాంత్, అడ్రియన్, రోహిత్‌తో కూడిన భారత జట్టు 50 మీ. రైఫిల్ 3-పీ టీమ్ పసిడి పతకం నెగ్గింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News