Korea Masters 2025: కొరియాలో భారత్‌కు నిరాశ
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:07 AM
కొరియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. బుధవారం బరిలోకి దిగిన భారత షట్లర్లలో ఒక్కరు కూడా ముందంజ...
సువాన్: కొరియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలిరోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. బుధవారం బరిలోకి దిగిన భారత షట్లర్లలో ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. పురుషుల సింగిల్స్ ఆరంభ రౌండ్లో చికో ఆరా ద్వి వార్దోయా (ఇండోనేసియా)తో పోరులో 8-16తో వెనుకంజలో ఉన్న దశలో హెచ్‌ఎస్ ప్రణయ్ గాయం కారణంగా అర్థంతరంగా వెనుదిరిగాడు. మిగతా షట్లర్లలో ఆయుష్ షెట్టి 18-21, 18-21తో సు లి యాంగ్ (తైపీ) చేతిలో, కిరణ్ జార్జ్ 14-21, 22-20, 14-21తో లో కీన్ యే (సింగపూర్) చేతిలో, అనుపమ ఉపాధ్యాయ 16-21, 15-21తో పుత్రి వర్దాని (ఇండోనేసియా) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్/లక్షిత జగ్లాన్ జోడీ 7-21, 14-21తో జపాన్ ద్వయం యు షిమోగామి/సయాక హొబార చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి