Asian Archery Championships: సెమీస్‌లో ధీరజ్ సురేఖ
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:40 AM
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌ప్సలో ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ సెమీ్‌సకు చేరుకొన్నారు. పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లగా.. చికిత తానిపర్తికి క్వార్టర్స్‌లో చుక్కెదురైంది....
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌ప్సలో ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ సెమీ్‌సకు చేరుకొన్నారు. పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లగా.. చికిత తానిపర్తికి క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో ధీరజ్ 6-5తో అమ్రిఖోన్ సడికోవ్ (ఉజ్బెకిస్థాన్)పై, రాహుల్ 6-2తో లిన్ జిన్ సంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి ముందంజ వేశారు. మహిళల్లో దీపిక కుమారి 7-3తో వరల్డ్ కప్ స్వర్ణ పతక విజేత లి గహ్యున్ (కొరియా)కు షాకిచ్చింది. అంకిత భక్త్ 6-4తో జాంగ్ మిన్హె (జపాన్)పై, సంగీత 7-1తో జరీ రెహానె (ఇరాన్)పై గెలిచి ఫైనల్ ఫోర్‌కు చేరుకొన్నారు. కాగా, అంకిత, సంగీత, అన్షికల టీమ్ క్వార్టర్స్‌లోనే ఓడింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో సురేఖ 147-145తో ఒ యుహయున్ (కొరియా)పై, ప్రతీక ప్రదీప్ 148-146తో చికితపై గెలిచారు. కాగా, అభిషేక్ వర్మ, ప్రథమేష్, రాజేష్ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు ఫైనల్‌కు చేరుకొంది. సెమీ్‌సలో భారత్ షూటా్‌ఫలో థాయ్‌లాండ్‌పై గెలిచింది.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి