Share News

Devon Conway Hits Double: కాన్వే ‘డబుల్‌’

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:19 AM

వెస్టిండీ్‌సతో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (367 బంతుల్లో 31 ఫోర్లతో 227) డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. రచిన్‌ రవీంద్ర (72 నాటౌట్‌)...

Devon Conway Hits Double: కాన్వే ‘డబుల్‌’

కివీస్‌ 575/8 డిక్లేర్డ్‌

మౌంట్‌ మాంగనుయ్‌: వెస్టిండీ్‌సతో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (367 బంతుల్లో 31 ఫోర్లతో 227) డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. రచిన్‌ రవీంద్ర (72 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీ చేశాడు. ఫలితంగా ఓవర్‌నైట్‌ స్కోరు 334/1తో రెండోరోజైన శుక్రవారం ఆటను కొనసాగించిన కివీస్‌ 575/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కాన్వేకిది టెస్టు కెరీర్‌లో రెండో ద్విశతకం. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌.. బ్రాండన్‌ కింగ్‌ (55 నాటౌట్‌), క్యాంప్‌బెల్‌ (45 నాటౌట్‌) రాణించడంతో రెండో రోజు ఆట చివరికి 110/0 స్కోరు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 04:19 AM