Share News

World Para Athletics 2025: దీప్తికి రజతం

ABN , Publish Date - Sep 28 , 2025 | 05:18 AM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజి రజతంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 విభాగం రేసులో దీప్తి 55.16 సెకన్ల టైమింగ్‌తో...

World Para Athletics 2025: దీప్తికి రజతం

న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజి రజతంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 విభాగం రేసులో దీప్తి 55.16 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్‌ జిల్లాకు చెందిన 22 ఏళ్ల దీప్తి గతేడాది ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. కానీ, ఈసారి రజతానికే పరిమితమైంది. ఇక, నిరుడు రన్నరప్‌గా నిలిచిన టర్కీ రేసర్‌ ఐసెల్‌ ఆండర్‌ 54.96 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సొంతం చేసుకొంది. కాగా, పురుషుల హైజంప్‌ టీ63 కేటగిరీలో విజేతగా నిలిచిన శైలేష్‌ కుమార్‌ ఈ టోర్నీలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. భారత్‌కే చెందిన వరుణ్‌ సింగ్‌ భాటి కాంస్యం దక్కించుకొన్నాడు. 1.91 మీటర్ల ఎత్తు దూకిన శైలేష్‌ చాంపియన్‌షి్‌ప్స, ఆసియా రికార్డును బద్దలుకొట్టాడు. భాటి, ఎజ్రా ఫ్రెంచ్‌ (అమెరికా) 1.85 మీటర్లతో సమంగా నిలిచారు. కానీ, కౌంట్‌ బ్యాక్‌లో ఎజ్రాకు రజతం, భాటికి కాంస్యం దక్కాయి.

అల్‌కాబీ ప్రపంచ రికార్డు: యూఏఈ అథ్లెట్‌ తెక్రా అల్‌కాబీ మహిళల 100 మీ టీ71 ఫ్రేమ్‌ రన్నింగ్‌ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 19.89 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసిన అల్‌కాబీ..ఈ ఏడాది బెల్లా మార్కస్‌ (లిథువేసినా- 20.08 సె) రికార్డును అధిగమించింది.


ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

రష్మిక జోడీకి స్వర్ణం

న్యూఢిల్లీ: ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు టాప్‌-2తో అదరగొట్టగా.. స్కీట్‌లో రైజా థిల్లాన్‌ రజతం సాధించింది. శనివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సహచర భారత జోడీల మధ్య జరిగిన ఫైనల్లో రష్మిక సెహగల్‌-కపిల్‌ జంట 16-10తో వన్షిక చౌదరి-ఆంథోనీ జొనాథన్‌ జంటపై గెలిచి స్వర్ణం సాధించింది. మహిళల స్కీట్‌ ఫైనల్లో థిల్లాన్‌ రజతంతో సరిపెట్టుకొంది. మాన్సీ రఘువంశీ కాంస్యం దక్కించుకొంది. దీంతో భారత్‌ మూడు స్వర్ణాలు సహా 11 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.

షూటింగ్‌

జూ. వరల్డ్‌కప్‌ ‘శాఫ్‌’ విజేత భారత్‌

కొలంబో: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌-17 చాంపియన్‌షి్‌పను భారత్‌ గెల్చుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో యువ భారత్‌ 4-1తో పెనాల్టీ షూటౌట్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్ల స్కోర్లు 2-2తో సమంగా ఉన్నాయి. కాగా, ఈ టైటిల్‌ నెగ్గడం భారత్‌కిది ఏడోసారి.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

విండీస్‌తో టెస్ట్ సిరీస్.. జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 05:18 AM