Asian Archery Championship: మిక్స్‌డ్ ఫైనల్‌కు దీప్షిక జోడీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:11 AM
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీ దీప్షిక/అభిషేక్ వర్మ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణానికి...
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీ దీప్షిక/అభిషేక్ వర్మ ఫైనల్‌కు దూసుకెళ్లి స్వర్ణానికి అడుగుదూరంలో నిలిచింది. సెమీఫైనల్లో దీప్షిక ద్వయం 156-153తో కజకిస్థాన్‌ను చిత్తుచేసింది. టైటిల్‌పోరులో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భారత జంట అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అన్షికా కుమారి/యశ్‌దీప్ భోగె జోడీ కాంస్య పతక పోరులో నిలిచింది. క్వార్టర్స్‌లో 5-1తో బంగ్లాను మట్టికరిపించిన అన్షిక జంట సెమీ్‌సలో మాత్రం 0-6తో చైసీస్ తైపీ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. దీంతో కాంస్యం కోసం టాప్‌సీడ్ కొరియాతో భారత్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి