Share News

Asia Junior Badminton Championships: దీక్ష షైనాలకు స్వర్ణాలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 06:25 AM

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్సలో దీక్ష సుధాకర్‌, షైనా మణిముత్తు స్వర్ణాలతో మెరిశారు. బాలికల అండర్‌-17 కేటగిరీలో సహచర భారత ప్లేయర్ల మధ్య జరిగిన ఫైనల్లో..

Asia Junior Badminton Championships: దీక్ష షైనాలకు స్వర్ణాలు

  • ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌

చెంగ్డు: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్సలో దీక్ష సుధాకర్‌, షైనా మణిముత్తు స్వర్ణాలతో మెరిశారు. బాలికల అండర్‌-17 కేటగిరీలో సహచర భారత ప్లేయర్ల మధ్య జరిగిన ఫైనల్లో దీక్ష 21-16, 21-9తో లక్ష్య రాజే్‌షపై గెలిచింది. దీంతో ఈ చాంపియన్‌షి్‌ప్సలో బంగారు పతకం నెగ్గిన తొలి భారత షట్లర్‌గా దీక్ష రికార్డులకెక్కింది. అండర్‌-15 తుదిపోరులో షైనా 21-14, 22-20తో చిహారు టోమిటా (జపాన్‌)పై నెగ్గింది. సెమీ్‌సలో ఓడడంతో జగ్‌షేర్‌ సింగ్‌, మిక్స్‌డ్‌ జోడీ జగ్జీత్‌ సింగ్‌-జననిక రమేష్‌ కాంస్యాలు దక్కాయి. టోర్నీలో భారత్‌ రెండు స్వర్ణ, రజత, రెండు కాంస్యాలు సాధించింది. అత్యధిక పతకాల పరంగా ఈ టోర్నీలో భారత జట్టుకిదే అత్యుత్తమ రికార్డు.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 06:25 AM