Share News

Davis Cup World Group 1: సింగిల్స్‌ బరిలో దక్షిణేశ్వర్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:21 AM

డేవి్‌సకప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1లో పటిష్ట స్విట్జర్లాండ్‌ను ఎదుర్కొనేందుకు భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో రిజర్వ్‌ ఆటగాడిగా ఉన్న...

Davis Cup World Group 1: సింగిల్స్‌ బరిలో దక్షిణేశ్వర్‌

  • రిజర్వ్‌ ప్లేయర్‌కు చాన్స్‌

  • డబుల్స్‌లో రిత్విక్‌

  • నేటి నుంచి డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 1

బీల్‌ (స్విట్జర్లాండ్‌): డేవి్‌సకప్‌ వరల్డ్‌ గ్రూప్‌-1లో పటిష్ట స్విట్జర్లాండ్‌ను ఎదుర్కొనేందుకు భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో రిజర్వ్‌ ఆటగాడిగా ఉన్న దక్షిణేశ్వర్‌ సురేశ్‌తో సింగిల్స్‌ ఆడించబోతున్నారు. ఆరు అడుగుల ఐదు అంగుళాల ఈ మధురై ఆటగాడు ట్రైనింగ్‌ సెషన్‌లో భారీ సర్వీ్‌సలతో ఆకట్టుకున్నాడు. అందుకే ఇండోర్‌ హార్డ్‌ కోర్టుల్లో సాగే పోటీలకు సురేశ్‌ ఆట సరిగ్గా సరిపోతుందని కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ భావిస్తున్నాడు. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో దక్షిణేశ్వర్‌.. జెరోమ్‌ కిమ్‌తో తలపడనున్నాడు. అలాగే భారత నెంబర్‌వన్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ మరో సింగిల్స్‌ ఆడనున్నాడు. అయితే యూఎస్‌ ఓపెన్‌లో గాయపడిన డబుల్స్‌ స్టార్‌ యుకీ భాంబ్రీ ఇంకా కోలుకోలేదు. దీంతో 13న జరిగే డబుల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీకి జతగా హైదరాబాదీ రిత్విక్‌ బొల్లిపల్లి బరిలోకి దిగుతాడు. 1993లో చివరిసారి స్విస్‌తో తలపడిన భారత్‌ ఓవరాల్‌గా 2-1తో ఆధిక్యంలో ఉంది. తాజా వరల్డ్‌ గ్రూప్‌-1లో విజేత డేవి్‌సకప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు వరల్డ్‌ గ్రూప్‌ 1 ప్లేఆ్‌ఫ్సకు పడిపోతుంది.

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:21 AM