Share News

Dabang Delhi Triumphs: బుల్స్‌పై దబాంగ్‌ గెలుపు

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:46 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌-12లో దబాంగ్‌ ఢిల్లీ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 41-34 స్కోరుతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది...

Dabang Delhi Triumphs: బుల్స్‌పై దబాంగ్‌ గెలుపు

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌-12లో దబాంగ్‌ ఢిల్లీ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 41-34 స్కోరుతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన దబాంగ్‌ ఢిల్లీ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రథమార్ధంలో బెంగళూరు బుల్స్‌ను వరుసగా రెండుసార్లు ఆలౌట్‌ చేశారు. దబాంగ్‌ రైడర్లను నిలువరించడంలో బుల్స్‌ డిఫెండర్లు విఫలమయ్యారు. దీంతో తొలి భాగంలో ఢిల్లీ 21-11 స్కోరుతో ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్ధంలో బెంగళూరు అనూహ్యంగా పుంజుకుని పోటీనిచ్చింది. అయితే అప్పటికే పూర్తి ఆధిక్యంతో ఉన్న దబాంగ్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ చివరి నిమిషాలలో వ్మూహాత్మకంగా ఆడి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేశారు. దబాంగ్‌ రైడర్లు ఆషు మాలిక్‌ 17 పాయింట్లు, నీరజ్‌ నర్వాల్‌ రెండు బోన్‌సలతో 7 పాయింట్లు రాబట్టారు. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 39-36 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 03:46 AM