Pro Kabaddi League: ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:04 AM
దబాంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ (పీకేఎల్) సీజన్-12లో ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫయర్-1లో ఢిల్లీ-పుణెరి పల్టన్ జట్లు నిర్ణీత సమయం ముగిసేసరికి 34-34తో సమంగా నిలవడంతో...
న్యూఢిల్లీ: దబాంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ (పీకేఎల్) సీజన్-12లో ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫయర్-1లో ఢిల్లీ-పుణెరి పల్టన్ జట్లు నిర్ణీత సమయం ముగిసేసరికి 34-34తో సమంగా నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం తేల్చేందుకు టైబ్రేకర్ నిర్వహించగా ఢిల్లీ 6-4తో పుణెరిను ఓడించి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన పుణెరి జట్టు మంగళవారం జరిగే ఎలిమినేటర్-3లో గెలిచిన జట్టుతో బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో తలపడనుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్-2లో పట్నా పైరేట్స్ 46-37తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఆట ద్వితీయార్థంలో బెంగళూరు రైడర్ శుభమ్ ఒకే రైడ్‌లో ఏడు పాయింట్లు సాధించి పీకేఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మంగళవారం జరిగే ఎలిమినేటర్-3 మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో పట్నా ఆడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News