Indian Women's Cricket Team: అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. భారత్‌లో 'దంగల్' మూమెంట్
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:53 AM
'ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025' భారత క్రీడాకారిణిలు సొంతం చేసుకోవాలని యావత్ భారతదేశం కోరుకుంటోంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య ఈ మధ్యాహ్నం జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి..
ఇంటర్నెట్ డెస్క్: 'ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025' భారత క్రీడాకారిణిలు సొంతం చేసుకోవాలని యావత్ భారత దేశం కోరుకుంటోంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య ఈ రోజు (ఆదివారం) జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచి, భారత మహిళా క్రికెటర్లు ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించాలని క్రికెట్ దిగ్గజాలు సైతం ఆకాంక్షిస్తున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
ఇప్పటికే ఈ టోర్నీలో రెండుసార్లు రన్నరప్‌గా ఇండియా నిలువగా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా మధ్య టైటిల్ పోటీ .. రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ కూడా వరించబోతోంది.
విజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ప్రకటించింది. రికార్డు స్థాయిలో చాంపియన్‌కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.
అదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు.
భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్‌మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం