AUS vs IND: రెండో టీ20.. కుప్పకూలిన టాప్‌ఆర్టర్
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:14 PM
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టీ20లో భారత టాప్‌ఆర్డర్ వరుసగా పెవిలియన్ బాట పట్టింది. హేజిల్‌వుడ్, ఎల్లిస్ సంచలనం సృష్టించగా, అభిషేక్ శర్మ మాత్రమే దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
మెల్‌బోర్న్, అక్టోబర్ 31: ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు(శుక్రవారం) రెండో టీ20(AUS vs IND) మెల్‌బోర్న్ వేదికగా కొనసాగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా(Team India) బ్యాటింగ్‌కు దిగింది. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వర్షం అడ్డు పడటం సంగతి పక్కన పెడితే.. టీమిండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
హేజిల్‌వుడ్ బీభత్సం..
భారత్‌కు మూడో ఓవర్ నుంచే షాక్‌లు తగులుతూ వస్తున్నాయి. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్(5) ఈసారి విఫలమయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ చేతికి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌లోనే సంజు శాంసన్(2) నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(1)ను హేజిల్‌వుడ్(Hazlewood) ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కి తిలక్ వర్మ.. జట్టును ఆదుకుంటాడు అనుకుంటున్న సమయంలో బ్యాట్‌కు పనే చెప్పకుండా డకౌట్ అయ్యాడు.
అభిషేక్ శర్మ(48*)తో కలిసి అక్షర్ పటేల్(7) ముందుకు నడిపిస్తున్నాడు అనుకునే లోపే.. రనౌట్ రూపంలో అక్షర్ ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లకే టీమిండియా 69 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. భారీ షాట్లు ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 83-5.
ఈ వార్తలు కూడా చదవండి:
Alyssa Healy: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: ఎలీసా హీలీ
Jemimah Rodrigues: ‘జెమ్’మీమా రోడ్రిగ్స్..!