Share News

CM Revanth Reddy: క్రీడా రంగ అభివృద్ధికి విశేష కృషి

ABN , Publish Date - Aug 29 , 2025 | 02:14 AM

క్రీడా రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని ముఖ్యమం త్రి రేవంత్‌ రెడ్డి అ న్నారు. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) సీజన్‌-4 నిర్వహణకు సర్కారు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు...

CM Revanth Reddy: క్రీడా రంగ అభివృద్ధికి విశేష కృషి

సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: క్రీడా రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని ముఖ్యమం త్రి రేవంత్‌ రెడ్డి అ న్నారు. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) సీజన్‌-4 నిర్వహణకు సర్కారు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పీవీఎల్‌ సీజన్‌ పోస్టర్‌ను క్రీడల మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం హైదరాబాద్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..ఇలాంటి పోటీల నిర్వహణవల్ల హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరుగుతుందన్నారు. వాలీబాల్‌ లీగ్‌కు విచ్చేస్తున్న అన్ని జట్లకు ఆయన స్వాగతం పలికారు. అక్టోబరు రెండు నుంచి గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ లీగ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ 2025.. మెద్వెదెవ్‌ అవుట్‌

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. ఇషా బృందానికి కాంస్యం

మరిన్ని క్రీడా తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 02:14 AM