Womens Asia Cup Hockey: భారత్ జోరుకు బ్రేక్
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:15 AM
ఆసియా కప్‌లో భారత అమ్మాయిల జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న మనోళ్లకు ఆతిథ్య చైనా షాకిచ్చింది....
చైనా చేతిలో ఓటమి
మహిళల ఆసియా కప్ హాకీ
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్‌లో భారత అమ్మాయిల జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న మనోళ్లకు ఆతిథ్య చైనా షాకిచ్చింది. గురువారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో చైనా 4-1తో భారత్‌పై నెగ్గింది. ముంతాజ్ (38వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందించింది. జూ మీరాంగ్ (4, 56 ని.), చెన్ యాంగ్ (31), టాన్ జిన్హూవాంగ్ (47) చైనా తరపున గోల్స్ చేశా రు. శుక్రవారం జరిగే తదుపరి పోరులో జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మనోళ్లకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది.
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి