Archery World Youth Championship: చికిత స్వర్ణ చరిత్ర
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:30 AM
తెలుగమ్మాయి, యువ ఆర్చర్ తానిపర్తి చికితరావు స్వర్ణ చరిత్ర సృష్టించింది. ఆదివారం కెనడాలో ముగిసిన ఆర్చరీ ప్రపంచ యూత్ చాంపియన్‌షి్‌ప కాంపౌండ్ విభాగం అండర్-21లో చికిత పసిడి పతకం కొల్లగొట్టింది...
ఆర్చరీ వరల్డ్ యూత్ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటిన తెలుగమ్మాయి
సూరజ్‌కు రజతం
విన్నిపెగ్ (కెనడా): తెలుగమ్మాయి, యువ ఆర్చర్ తానిపర్తి చికితరావు స్వర్ణ చరిత్ర సృష్టించింది. ఆదివారం కెనడాలో ముగిసిన ఆర్చరీ ప్రపంచ యూత్ చాంపియన్‌షి్‌ప కాంపౌండ్ విభాగం అండర్-21లో చికిత పసిడి పతకం కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ఆర్చర్ చికితానే కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 20 ఏళ్ల చికిత 142-133తో స్పెయిన్ ఆర్చర్ పౌలా డియాజ్ మోరిల్లా్‌సపై విజయం సాధించింది. అంతకుముందు సెమీ్‌సలో చికిత 142-136తో పార్క్ యెరిన్ (రిపబ్లిక్ ఆఫ్ కొరియా)పై, క్వార్టర్స్‌లో ఆసియా చాంపియన్, భారత్‌కే చెందిన పర్నీత్ కౌర్‌పై 146-143తో గెలిచింది. ఇక, పురుషుల అండర్-18 టీమ్ ఈవెంట్‌లో తెలుగు సంతతికి చెందిన అమెరికా ఆర్చర్ నాళం సూరజ్ కార్తికేయ బృందానికి రజత పతకం లభించింది. సూరజ్ తల్లిదండ్రుల స్వస్థలం రాజమండ్రి. సూరజ్ కూడా గతంలో రాజమండ్రిలో శిక్షణ తీసుకొన్నాడు.
ఆఖరి నిమిషం వరకు టెన్షన్..
‘ఆంధ్రజ్యోతి’తో చికిత
మా స్వస్థలం తెలంగాణలోని పెద్దపల్లి. నాన్న శ్రీనివాసరావు రైతు. బాల్యం నుంచి ఆర్చరీపై మక్కువ. దీంతో విలు క్రీడనే కెరీర్‌గా ఎంచుకున్నా. గత రెండు జాతీయ క్రీడల్లో రజత, కాంస్య పతకాలు సాధించా. ఈ ఏడాది జరిగిన ఆసియాకప్‌లో నాలుగో స్థానంలో నిలిచి, త్రుటిలో పతకం కోల్పోయా. అమెరికాలో జరిగిన గత వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించినా వీసా సమస్యతో బరిలోకి దిగలేకపోయా. ఈసారి వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌నకు వీసా లభించినా కెనడా ఎయిర్‌లైన్స్ సమ్మె కారణంగా మా ప్రయాణ షెడ్యూల్ మొత్తం తలకిందులైంది. ఆఖరి నిమిషం వరకు కెనడా వెళ్లేందుకు మార్గం సుగమం కాలేదు. భారత్ నుంచి మొత్తం 36 మందితో కూడిన బృందం అక్కడికి వెళ్లాల్సి ఉండగా సమ్మె కారణంగా విడతల వారీగా వెళ్లాల్సి వచ్చింది. చివరి విడతకు వచ్చేసరికి ప్రయాణ అవకాలన్నీ దాదాపుగా మూసుకుపోగా ‘సాయ్’ అధికారుల గట్టి ప్రయత్నంతో నాతో పాటు మరో ఐదుగురు ఆర్చర్లు పోటీలకు కొన్ని గంటల ముందు కెనడాలో అడుగు పెట్టాం. సరైనా విశ్రాంతి లేకుండానే తొలి రెండు రౌండ్లలో పాల్గొన్నా. ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్స్‌లో ఆసియా చాంపియన్ పర్నీత్ కౌర్‌పై గెలిచాక పసిడి పతకం గెలుస్తానన్న నమ్మకం కలిగింది. అదే ఆత్మవిశ్వాసంతో సెమీస్, ఫైనల్‌లో పోటీపడి ఫలితం రాబట్టా. సీనియర్ క్రీడాకారుడు అభిషేక్ వర్మ సలహాలు సూచనలతో ఈ విజయం సాధించగలిగా.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News