Champions Trophy Final: ఫైనల్ ఆడేది ఎవరెవరు.. తుది జట్టులో మార్పులేమైనా ఉంటాయా
ABN , Publish Date - Mar 08 , 2025 | 09:41 PM
ఛాంపియన్స్ ట్రోఫీ మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో మార్పులేమైనా ఉంటాయా లేదా నాకౌట్ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
కొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సమయం దగ్గర పడుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ (Champions Trophy Final) కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో మార్పులేమైనా ఉంటాయా లేదా నాకౌట్ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఫైనల్ మ్యాచ్ కోసం దుబాయ్‌లో బ్యాటింగ్ వికెట్‌ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు భారత్ దుబాయ్‌లో ఆడిన మ్యాచ్‌లన్నీ స్లో వికెట్లపైనే జరిగాయి. దీంతో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు కాస్త అనుకూలిస్తుందని 280-300 పరుగులు సులభంగా వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్‌ను పక్కన పెట్టి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసకుంటారని చాలా మంది అంచనా వేస్తున్నారు.
గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇతర స్పిన్నర్లతో పోలిస్తే కుల్దీప్ కాస్త ఎక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా వికెట్ల వేటలో కూడా వెనుకబడ్డాడు. అలాగే ఫీల్డింగ్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ చేయగలిగే వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. న్యూజిలాండ్‌లో లెఫ్టార్మ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. వారిని కట్టడి చేసేందుకు రైటార్మ్ బౌలర్ అయిన వాషింగ్టన్ సందర్‌ను తీసుకోవాలని యోచిస్తున్నారట. ఏదేమైనా పిచ్‌ను బట్టి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఆటగాళ్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..