Central Zone Clinches Duleep Trophy: విజేత సెంట్రల్ జోన్
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:40 AM
పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెంట్రల్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో సోమవారం ఆఖరి రోజు సెంట్రల్ ముందు...
ఫైనల్లో సౌత్‌పై గెలుపు జూ దులీప్ ట్రోఫీ
బెంగళూరు: పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెంట్రల్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో సోమవారం ఆఖరి రోజు సెంట్రల్ ముందు సౌత్‌జోన్ కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ ఛేదనను సెంట్రల్ 20.3 ఓవర్లలో ముగించింది. అయితే సౌత్ బౌలర్ల ధాటికి నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. అంతకుముందు సౌత్ రెండో ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. అంకిత్ శర్మ (99), సిద్ధార్థ్ (84), స్మరణ్ (67) అర్ధసెంచరీలు సాధించారు. కార్తికేయకు 4, సారాంశ్‌కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ 149, సెంట్రల్ 511 పరుగులు చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News