Carlos Alcaraz US Open 2025: ఈసారి అల్కారాజే
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:32 AM
ఫెడరర్, నడాల్, జొకోవిచ్‌ల బిగ్ త్రీ శకం ముగిసి కార్లోస్ అల్కారజ్, జానిక్ సినర్ జమానా మొదలైంది. ఒక గ్రాండ్‌స్లామ్ నీదైతే..మరొకటి నాది అన్న చందంగా ఈ ఇద్దరి జోరు నడుస్తోంది. వింబుల్డన్‌లో సినర్ చాంపియన్‌గా...
యూఎస్ ఓపెన్ చాంపియన్‌కార్లోస్
ఫైనల్లో సినర్‌పై విజయం జూ నెం.1 ర్యాంక్ కూడా కైవసం
న్యూయార్క్: ఫెడరర్, నడాల్, జొకోవిచ్‌ల బిగ్ త్రీ శకం ముగిసి కార్లోస్ అల్కారజ్, జానిక్ సినర్ జమానా మొదలైంది. ఒక గ్రాండ్‌స్లామ్ నీదైతే..మరొకటి నాది అన్న చందంగా ఈ ఇద్దరి జోరు నడుస్తోంది. వింబుల్డన్‌లో సినర్ చాంపియన్‌గా ఆవిర్భవిస్తే..ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో అల్కారజ్ జయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ అల్కారజ్ (స్పెయిన్) 6-2, 3-6, 6-1 6-4తో ఇటలీకి చెందిన టాప్ సీడ్ సినర్‌ను చిత్తు చేశాడు. తద్వారా వింబుల్డన్ తుదిపోరులో సినర్ చేతిలో ఓటమికి అల్కారజ్ బదులు తీర్చుకున్నాడు. రెండున్నర గంటల పోరులో అల్కారజ్ 10 ఏస్‌లతో బెంబేలెత్తించగా.. రెండు ఏస్‌లకే పరిమితమైన జానిక్ నాలుగు డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. 22 ఏళ్ల కార్లోస్‌కిది రెండో యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు. మరోవైపు 24 ఏళ్ల సినర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్, వింబుల్డన్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. అంటే..నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను ఇద్దరు చెరో రెండు పంచుకున్నారన్నమాట. ఓవరాల్‌గా అల్కారజ్‌కిది కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్.
డబుల్ ధమాకా
యూఎస్ ఓపెన్ విజయంతో అల్కారజ్.. ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంక్‌నూ చేజిక్కించుకొని డబుల్ ధమాకా సృష్టించాడు. ఈ టోర్నీకి ముందు అల్కారజ్ రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. అతను టాప్ ర్యాంక్‌లోకి రావడం 2023 సెప్టెంబరు తర్వాత ఇదే తొలిసారి. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న సినర్..ఫైనల్ ఓటమితో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు.

ట్రంప్‌పై ఫ్యాన్స్ గరం గరం
అల్కారజ్, సినర్ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. దాంతో ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే స్టేడియంలోకి అనుమతించారు. ఇంకా..భద్రతా కారణాల రీత్యా వాళ్ల కార్లను స్టేడియానికి ఎంతో దూరంలో నిలిపి వేయించారు. పైగా..ట్రంప్ రాకవల్ల మ్యాచ్ నిర్ణీత సమయానికన్నా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ట్రంప్ రాకతో తీవ్ర అసౌకర్యానికి లోనైన అభిమానులు..బిగ్ స్ర్కీన్‌పై ఆయన కనిపించగానే హేళన చేశారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి