CEAT Cricket Rating Awards: బీఎస్ లారాకు లైఫ్ టైమ్ అవార్డులు
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:48 AM
ప్రతి ఏటా ప్రకటించే ప్రఖ్యాత సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల్లో ఈసారి భారత దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారాలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్...
ముంబై: ప్రతి ఏటా ప్రకటించే ప్రఖ్యాత సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల్లో ఈసారి భారత దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారాలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాలు దక్కాయి. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గవాస్కర్ చేతుల మీదుగా లారా ఈ అవార్డును అందుకున్నాడు. ‘టీ20 బ్యా టర్ ఆఫ్ ది ఇయర్’గా సంజూ శాంసన్, బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి అవార్డులు గెలుచుకోగా.. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మను ప్రత్యేక జ్ఞాపికతో సన్మానించారు. ఇక, ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన భారత క్రికెటర్‌గా నిలిచినందుకు శ్రేయాస్ అయ్యర్‌కు జ్ఞాపిక అందుకున్నాడు. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా పురుషుల్లో జో రూట్ నిలవగా, మహిళల్లో స్మృతీ మంధాన అవార్డును దక్కించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News