Share News

Andhra Premier League 2025: కింగ్స్‌పై బుల్స్‌ గెలుపు

ABN , Publish Date - Aug 20 , 2025 | 02:46 AM

ఏపీఎల్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భీమవరం బుల్స్‌ 27 పరుగుల తేడాతో కాకినాడ కింగ్స్‌ ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బుల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు...

Andhra Premier League 2025: కింగ్స్‌పై బుల్స్‌ గెలుపు

విశాఖపట్నం స్పోర్ట్సు (ఆంధ్రజ్యోతి): ఏపీఎల్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భీమవరం బుల్స్‌ 27 పరుగుల తేడాతో కాకినాడ కింగ్స్‌ ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బుల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. సాయిశ్రవణ్‌ (58 పరుగులు), రేవంత్‌రెడ్డి (51) అర్ధ సెంచరీలు సాధించారు. కింగ్స్‌ బౌలర్లలో సుదర్శన్‌, మణికంఠకు చెరి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో కాకినాడ 19.5 ఓవర్లలో 187 రన్స్‌కే ఆలౌటైంది. కేఎస్‌ భరత్‌ (76) కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం దక్కలేదు. బుల్స్‌ బౌలర్లలో శివ, సత్యనారాయణ రాజు, మనీష్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మరో మ్యాచ్‌లో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ (161/5)పై అమరావతి రాయల్స్‌ (17.3 ఓవర్లలో 163/3) గెలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు

నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి

Read Latest AP News and National News

Updated Date - Aug 20 , 2025 | 02:46 AM