Bharats Stellar Performance Leads: అదరగొట్టిన భరత్
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:18 AM
తెలుగు టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ భరత్ హుడా 23 పాయింట్లతో చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆ జట్టు ట్రోఫీని ముద్దాడేందుకు రెండు విజయాల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3లో...
ఎలిమినేటర్-3లో పట్నాపై తెలుగు టైటాన్స్ గెలుపు
న్యూఢిల్లీ: తెలుగు టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ భరత్ హుడా 23 పాయింట్లతో చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆ జట్టు ట్రోఫీని ముద్దాడేందుకు రెండు విజయాల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్-3లో టైటాన్స్ 46-39తో బలమైన పట్నా పైరేట్స్‌ను ఓడించి క్వాలిఫయర్-2 పోరుకు అర్హత సాధించింది. టైటాన్స్ స్టార్ ఆటగాడు భరత్ విజృంభణతో పట్నా ఆత్మరక్షణలో పడిపోయింది. భరత్‌తో పాటు టైటాన్స్ కెప్టెన్ మాలిక్ (5 పాయింట్లు), డిఫెండర్లు అజిత్, శుభమ్ రాణించారు. ఇక, బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో పుణెరి పల్టన్‌తో టైటాన్స్ తాడోపేడో తేల్చుకోనుంది. ఇందులో నెగ్గిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో దబాంగ్ ఢిల్లీతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News