BCCI: బీసీసీఐ కన్నెర.. పేమెంట్లలో కోత.. ఫ్యామిలీకి నో ఛాన్స్.. ఆటగాళ్లకు కఠిన నిబంధనలు..
ABN , Publish Date - Jan 15 , 2025 | 08:56 AM
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైట్‌వాష్, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓటమి నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకు కఠినతరమైన నిబంధనలు రూపొందించింది. శనివారం బీసీసీఐ నిర్వహించిన సమీక్షా
స్వదేశంలోనూ, విదేశంలోనూ దారుణంగా విఫలమవుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న టీమిండియా (TeamIndia)పై కొరడా ఝుళిపించేందుకు బీసీసీఐ (BCCI) సిద్ధమవుతోంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓటమి, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వైట్‌వాష్, ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓటమి నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగింది. ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకు కఠినతరమైన నిబంధనలు రూపొందించింది. శనివారం బీసీసీఐ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రోహిత్ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli) వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ గంభీర్ (Gautam Gambhir)కు కూడా బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్టు సమాచారం.
టీమిండియా ఆటగాళ్లు విదేశీ పర్యటనలకు వెళ్తున్న సమయంలో వారి భార్యలను కూడా తీసుకెళ్లవచ్చని బీసీసీఐ 2019లో అనుమతిని ఇచ్చింది. అలా అనుమతివ్వడం వల్ల ఆర్థిక భారంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన కూడా ప్రభావితమవుతున్నట్టు బీసీసీఐ భావిస్తోంది. అందువల్ల ఇకపై ఏ విదేశీ పర్యటనకు భార్యలను తీసుకెళ్లే అనుమతిని ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. ఇకపై ఏదైనా టోర్నీ కోసం భారత జట్టు 45 రోజుల పాటు విదేశంలో ఆడితే అందులో కేవలం 14 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులను బీసీసీఐ అనుమతిస్తుందట. సదరు పర్యటన తక్కువగా ఉంటే కుటుంబ సభ్యులను కేవలం 7 రోజులు మాత్రమే అనుమతి లభిస్తుందట.
జట్టులోని ప్రతి ఒక్కరూ ఇకపై టీమ్ బస్‌లోనే ప్రయాణించాలని కూడా బీసీసీఐ హుకుం జారీ చేసిందట. ఆటగాళ్ల లగేజీ 150 కేజీలకు మించి ఉంటే దానికి బీసీసీఐ అదనపు ఛార్జీలను చెల్లించదట. ఆటగాళ్లే వ్యక్తిగతంగా చెల్లింపులు చేసుకోవాలట. అలాగే హెడ్ కోచ్ గంభీర్ స్వేచ్ఛకు కూడా బీసీసీఐ కత్తెర వేయనుందట. గంభీర్ వ్యక్తిగత మేనేజర్ ఇకపై వీఐపీ బాక్స్‌లో కూర్చోవడానికి కుదరదని, జట్టు బస చేసిన హోటల్‌లో ఉండడం, జట్టుతో పాటు బస్సులో ప్రయాణించడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి జీతాలను చెల్లించే విధానాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తోందట. సరిగ్గా ఆడని ఆటగాళ్ల జీతంలో కోత విధించాలని బీసీసీఐ అనుకుంటోందట.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..