Share News

Vijay Hazare Trophy: హజారే లో ఆడండి

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:14 AM

జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ స్పష్టం చేసినట్టు తెలిసింది. డిసెంబరు 24 నుంచి జరిగే...

Vijay Hazare Trophy: హజారే లో ఆడండి

రోహిత్‌, కోహ్లీకి స్పష్టంజేసిన బోర్డు

న్యూఢిల్లీ: జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ స్పష్టం చేసినట్టు తెలిసింది. డిసెంబరు 24 నుంచి జరిగే ఈ టోర్నీలో ఆడేదీ లేనిదీ వీరిద్దరూ ఇంకా బోర్డుకు సమాచారం అందించలేదు. అయితే తాను ఆడతానని ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ)కు రోహిత్‌ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఎంసీఏ వాటిని తోసిపుచ్చింది. రోహిత్‌ నుంచి తమకెలాంటి సమాచారమూ లేదని తెలిపింది. కాగా, దక్షిణాఫ్రికాతో ఈ నెల 30 నుంచి జరిగే మూడు వన్డేల సిరీ్‌సను దృష్టిలో ఉంచుకొని రోహిత్‌ రోజూ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడే విషయమై కోహ్లీ కూడా మౌనంగా ఉన్నాడు. టెస్ట్‌లు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌, కోహ్లీ వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆస్ట్రేలియా టూర్‌లో మూడు వన్డేల సిరీ్‌సలో వీరిద్దరూ బరిలోకి దిగారు.

టాప్‌లోనే రోహిత్‌

దుబాయ్‌: ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన రోహిత్‌ కెరీర్‌లో తొలిసారి నెం:1 ర్యాంక్‌ను కైవసం చేసుకొన్న సంగతి విదితమే. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంక్‌ల జాబితాలో రోహిత్‌ 781 పాయింట్లతో టాప్‌లోనే ఉన్నాడు. కాగా, కోహ్లీ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌కు ఎగబాకగా.. శుభ్‌మన్‌ గిల్‌ నాలుగో స్థానంలో నిలకడగా ఉన్నాడు. ఇబ్రహీం జద్రాన్‌ (అఫ్ఘానిస్థాన్‌), డారెల్‌ మిచెల్‌ (న్యూజిలాడ్‌) రెండు, మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..

అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 05:14 AM