Share News

Apollo Tyres Team India: బీసీసీఐకి జాక్‌పాట్‌

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:54 AM

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ఖజానా మరింత బరువెక్కనుంది. భారత క్రికెట్‌ జట్టు నూతన ప్రధాన స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ ఏకంగా రూ.579 కోట్ల కళ్లుచెదిరే...

Apollo Tyres Team India: బీసీసీఐకి జాక్‌పాట్‌

రూ.579 కోట్లతో ఒప్పందం

టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ఖజానా మరింత బరువెక్కనుంది. భారత క్రికెట్‌ జట్టు నూతన ప్రధాన స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ ఏకంగా రూ.579 కోట్ల కళ్లుచెదిరే మొత్తంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ రెండున్నరేళ్ల పాటు కొనసాగి 2028, మార్చిలో ముగుస్తుంది. ఇక నుంచి పురుషుల, మహిళల జట్లకు సంబంధించిన మూడు ఫార్మాట్ల జెర్సీలపై కంపెనీ లోగో ఉంటుంది. గతంలో జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగిన డ్రీమ్‌ 11 రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ చట్టం కారణంగా ఏడాది ముందుగానే ఆ కంపెనీ వైదొలగాల్సివచ్చింది. ప్రస్తుతం ఆసియాక్‌పలో తలపడుతున్న భారత జట్టు ఎలాంటి లోగో లేకుండానే ఆడుతోంది. ఈ నేపథ్యంలో బోర్డు కొత్త స్పాన్సర్‌ కోసం బిడ్లు ఆహ్వానించింది. అటు అపోలో టైర్స్‌కు కాన్వా రూ.544 కోట్లతో, జేకే సిమెంట్స్‌ రూ.477 కోట్లతో గట్టి పోటీనే ఇచ్చాయి. కానీ ఈ రెండు కంపెనీల కంటే చాలా ఎక్కువ మొత్తమే కోట్‌ చేయడంతో అపోలో టైర్స్‌ విజేతగా నిలిచింది. వాస్తవానికి బోర్డు రూ.450 కోట్ల వరకు రావచ్చని ఆశించింది. ద్వైపాక్షిక సిరీ్‌సల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.3.5 కోట్లు, వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లను కనీస ధరగా పేర్కొంది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అపోలో టైర్స్‌ నుంచి మ్యాచ్‌కు దాదాపు రూ.4.5 కోట్లు దక్కబోతోంది. మొదట ఈనెల 30 నుంచి ఆసీస్‌ ‘ఎ’ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీ్‌సలో భారత్‌ ‘ఎ’ ఆటగాళ్లు అపోలో టైర్స్‌ జెర్సీలను ధరించి ఆడనున్నారు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్

పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 05:54 AM