BCCI Invites Bids: స్పాన్సర్‌షిప్ వేటలో బీసీసీఐ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:49 AM
టీమిండియా ప్రధాన స్పాన్సరర్ కోసం బీసీసీఐ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆసక్తిగల కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ చట్టం...
బిడ్ దాఖలుకు ఈనెల 16 తుది గడువు
గేమింగ్, బెట్టింగ్ కంపెనీలపై నిషేధం
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన స్పాన్సరర్ కోసం బీసీసీఐ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆసక్తిగల కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా జట్టు స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 తమ ఒప్పందాన్ని మరో ఏడాది ఉండగానే రద్దు చేసుకోవాల్సివచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బోర్డు కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేయనుంది. దీనిలో భాగంగా ఆన్‌లైన్ , గ్యాంబ్లింగ్, బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ, ఆల్కహాల్, పోర్నోగ్రఫీలతో ప్రత్యక్ష లేక పరోక్ష సంబంధం ఉన్న కంపెనీలకు అనుమతి లేదు. కంపెనీపై, యజమానులపై ఎలాంటి క్రిమినల్ కేసులూ ఉండరాదు. ఆర్‌బీఐ జాబితాలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఉండకూడదు. మూడేళ్ల కాలంలో కంపెనీ సగటు టర్నోవర్ కనిష్టంగా రూ.300 కోట్లు ఉండాలి. ఇలా ఈ నిబంధనల్ని పాటించే కంపెనీలు మాత్రమే ఈనెల 16లోగా దరఖాసు చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో 9 నుంచి ఆరంభమయ్యే ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు జెర్సీపై స్పాన్సర్ పేరు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి