Share News

BCCI Bank Balance Surges: 2019లో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 6 వేల కోట్లు.. 2024లో ఎంతంటే..

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:37 PM

2023-2024 సంవత్సరానికి గానూ బీసీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లాటినమ్ జూబ్లీ బినీవలెంట్ ఫండ్ కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించింది.

BCCI Bank Balance Surges: 2019లో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 6 వేల కోట్లు.. 2024లో ఎంతంటే..
BCCI Bank Balance Surges

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) రికార్డులను తిరగరాస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతీ ఏటా డబుల్, త్రిబుల్ అవుతోంది. క్రిక్‌బజ్ రిపోర్టు ప్రకారం.. 2019లో స్టేట్ బోర్డులకు పంచింది పోగా బీసీసీఐ బ్యాంక్ ఖాతాలో 6,059 కోట్లు మిగిలాయి. 2024లో స్టేట్ బోర్డులకు పంచింది పోగా ఏకంగా 20, 686 కోట్ల రూపాయలు మిగిలాయి. గత ఐదేళ్లలో బీసీసీఐ బ్యాంక్ ఖాతాలో డబ్బులు డబుల్ అయ్యాయి.


14, 627 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరింది. జనరల్ ఫండ్ కూడా బాగా పెరిగింది. 2019లో ఈ ఫండ్ 3,906 కోట్ల రూపాయలుగా ఉండేది. 2024 నాటికి 7,988 కోట్లకు చేరింది. అంటే 4,082 కోట్లు అదనంగా వచ్చి చేరింది. 2023-2024 సంవత్సరానికి గాను బీసీసీఐ ట్యాక్సుల రూపంలో 3,150 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇన్వెస్టిమెంట్ ఇన్‌కమ్ 533.05 కోట్ల రూపాయల నుంచి 986.45 కోట్ల రూపాయలకు చేరింది. డిపాజిట్లపై అత్యధిక మొత్తంలో లాభాలను గడించింది. 2023లో ఐపీఎల్ ఆదాయం 1,167. 99 కోట్ల రూపాయలు ఉండేది.


2024లో అది 1,623.08 కోట్లకు చేరింది. 2023-2024 సంవత్సరానికి గానూ బీసీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కోసం 1200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లాటినమ్ జూబ్లీ బినీవలెంట్ ఫండ్ కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించింది. క్రికెట్ డెవలప్‌మెంట్ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే, మీడియా రైట్స్ విషయంలో బీసీసీఐకి దెబ్బ పడింది. 2024 కంటే ముందు మీడియా రైట్స్ ఆదాయం 2,524.80 కోట్ల రూపాయలు ఉండగా 2024లో మాత్రం బాగా తగ్గింది. 813.14 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇంటర్ నేషనల్ మ్యాచ్‌లు తగ్గటంతో మీడియా రైట్స్ ఆదాయానికి బారీగా గండిపడింది.


ఇవి కూడా చదవండి

మహిళల దారుణం.. తోటి మహిళను చెట్టుకు కట్టేసి..

చెరుకు రసం తీయడానికి సూపర్ టెక్నిక్.. ఇంత కంటే స్వచ్ఛమైన చెరుకు రసం ఉండదేమో..

Updated Date - Sep 07 , 2025 | 12:59 PM