Share News

Viral Desi hacks: చెరుకు రసం తీయడానికి సూపర్ టెక్నిక్.. ఇంత కంటే స్వచ్ఛమైన చెరుకు రసం ఉండదేమో..

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:32 AM

అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి.

Viral Desi hacks: చెరుకు రసం తీయడానికి సూపర్ టెక్నిక్.. ఇంత కంటే స్వచ్ఛమైన చెరుకు రసం ఉండదేమో..
sugarcane juice viral video

అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో దేశీ టెక్నిక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (viral desi hacks). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చెరుకు రసం తీయడానికి వారు ఉపయోగిస్తున్న పద్ధతి చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Sugarcane juice viral video).


nguyenlethao1982 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక కుటుంబం చెరకు రసం తీయడానికి వినూత్న టెక్నిక్‌ను ఉపయోగిస్తోంది. చెరుకు రసం తీయడానికి మనమందరం పెద్ద యంత్రాలను ఉపయోగిస్తుంటాం. అలాంటి వనరులు లేకపోవడంతో ఆఫ్రికాకు చెందిన ఓ గిరిజన కుటుంబం కర్రలను ఉపయోగించి చెరుకు రసాన్ని తీసున్నారు (traditional juice making). రెండు కర్రలను చెట్టుకు కట్టి ఆ రెండు కర్రల మధ్య చెరుకును ఉంచుతున్నారు.


పైన ఉన్న కర్ర మీద ఒక వ్యక్తి కూర్చుని పైకి, కిందకు ఊగుతున్నాడు. రెండు కర్రల మధ్యన నులుగుతున్న చెరుకు నుంచి రసం కింద ఉన్న పళ్లెంలో పడుతోంది (pure sugarcane juice). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.6 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఇది చాలా స్వచ్ఛమైన చెరుకు రసం అని ఎక్కువ మంది కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ చూపునకు శక్తి ఉంటే.. ఈ అడవిలో స్పైడర్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..

చెప్పింది వినాలి కదా అక్కా.. బైక్ ఎక్కిన ఓ మహిళ పరిస్థితి ఏమైందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 10:32 AM