Asia Cup 2025: బంగ్లా సూపర్ బోణీ శ్రీలంకపై విజయం
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:53 AM
ఆసియాకప్ సూపర్-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయాన్నందుకుంది. ఓపెనర్ సైఫ్ హసన్ (61), తౌహీద్ హ్రిదయ్ (58) కీలక అర్ధసెంచరీలతో రాణించారు. అయితే చివరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి తడబడినా...
దుబాయ్: ఆసియాకప్ సూపర్-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయాన్నందుకుంది. ఓపెనర్ సైఫ్ హసన్ (61), తౌహీద్ హ్రిదయ్ (58) కీలక అర్ధసెంచరీలతో రాణించారు. అయితే చివరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి తడబడినా.. ఐదో బంతికి సింగిల్ తీసి ఊపిరిపీల్చుకుంది. ఫలితంగా శనివారం శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 4 వికెట్లతో నెగ్గింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు సాధించింది. షనక (64 నాటౌట్), కుశాల్ మెండిస్ (34) రాణించారు. లంక ఓపెనర్లు కుశాల్, నిస్సాంక (22) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవగా.. చివర్లో షనక ఎదురుదాడితో స్కోరు 160 దాటింది. షనక, కెప్టెన్ అసలంక (21) ఐదో వికెట్‌కు 57 రన్స్ జోడించారు. ముస్తాఫిజుర్ 3, మెహదీ హసన్2 వికెట్లు తీశారు. ఛేదనలో బంగ్లా 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. సైఫ్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఒత్తిడిని అధిగమించి: బంగ్లా ఛేదనలో తొలి ఓవర్‌లోనే ఓపెనర్ తన్‌జీద్ డకౌటైనా.. మరో ఓపెనర్ సైఫ్ భారీ సిక్సర్లతో బౌలర్లను సులువుగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ లిట్టన్ దాస్ (23) జతగా రెండో వికెట్‌కు 59, మూడో వికెట్‌కు హ్రిదయ్‌తో కలిసి 54 రన్స్ జోడించి విజయానికి బాటలు వేశాడు. 14వ ఓవర్‌లో సైఫ్ వెనుదిరిగాక హ్రిదయ్ బాధ్యతను తీసుకున్నాడు. అయితే విజయానికి 10 రన్స్ దూరంలో అతను అవుటయ్యాక మ్యాచ్‌లో హైడ్రామా నెలకొంది. ఆఖరి ఓవర్‌లో 5 రన్స్ అవసరమవగా, జకెర్ (9) తొలి బంతికే ఫోర్ బాదాడు. తర్వాత 3 బంతుల్లో పరుగులేమీ రాకుండా 2 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ ఐదో బంతికి సింగిల్ రావడంతో బంగ్లా సంబరాల్లో మునిగింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 168/7 (షనక 64 నాటౌట్, మెండిస్ 34; ముస్తాఫిజుర్ 3/20, మెహదీ హసన్ 2/25). బంగ్లాదేశ్: 19.5 ఓవర్లలో 169/6. (సైఫ్ హసన్ 61, హ్రిదయ్ 58; హసరంగ 2/22).
ఇవి కూడా చదవండి
పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్
మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి