Share News

Ayush Shetty Hong Kong Open: ఆయుష్‌ సంచలన విజయం

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:18 AM

భారత వర్ధమాన షట్లర్‌ ఆయుష్‌ షెట్టి సంచలన విజయంతో హాంకాంగ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకొన్నాడు. లక్ష్యసేన్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ కూడా రౌండ్‌-8కు చేరుకొన్నాయి...

Ayush Shetty Hong Kong Open: ఆయుష్‌ సంచలన విజయం

  • క్వార్టర్స్‌లో లక్ష్య సేన్‌, సాత్విక్‌ జోడీ

  • హాంకాంగ్‌ ఓపెన్‌

హాంకాంగ్‌: భారత వర్ధమాన షట్లర్‌ ఆయుష్‌ షెట్టి సంచలన విజయంతో హాంకాంగ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకొన్నాడు. లక్ష్యసేన్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ కూడా రౌండ్‌-8కు చేరుకొన్నాయి. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో ఆయుష్‌ 21-19, 12-21, 21-14తో 2023 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ రజతపతక విజేత కొడాయ్‌ నరోకా (జపాన్‌)పై పోరాడి గెలిచాడు. రౌం డ్‌-8లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్‌తో ఆయుష్‌ తలపడతాడు. కాగా సహచర షట్లర్ల మధ్య పోరులో సేన్‌ 15-21, 21-18, 21-10తో ప్రణయ్‌ను ఓడించాడు. కిరణ్‌ జార్జ్‌ 6-21, 12-21తో చోట్‌ సి (చైనీస్‌ తైపీ) చేతిలో చిత్తయ్యాడు. డబుల్స్‌లో సా త్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జంట 18-21 21-15, 21-11తో టీరారట్‌సకుల్‌-సుక్‌పున్‌ (ఽధాయ్‌లాండ్‌)పై గెలిచింది.

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:18 AM