Australian Cricket Legend: ఆసీస్ క్రికెట్ దిగ్గజంబాబ్ సింప్సన్ ఇకలేరు
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:31 AM
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బాబ్ సింప్సన్ (89) అనారోగ్యంతో మృతి చెందారు. జట్టు కెప్టెన్‌గానే కాకుండా ఆసీస్ తొలి కోచ్‌గా సింప్సన్ పని చేశారు. 1957-1978 మధ్య కాలంలో 62 టెస్ట్‌లు ఆడిన సింప్సన్...
సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బాబ్ సింప్సన్ (89) అనారోగ్యంతో మృతి చెందారు. జట్టు కెప్టెన్‌గానే కాకుండా ఆసీస్ తొలి కోచ్‌గా సింప్సన్ పని చేశారు. 1957-1978 మధ్య కాలంలో 62 టెస్ట్‌లు ఆడిన సింప్సన్ 4,869 రన్స్ సాధించారు. ఇందులో 10 సెంచరీలు ఉన్నాయి. లెగ్ స్పిన్నర్ కూడా అయిన ఆయన 71 వికెట్లు పడగొట్టారు. ఇక, వన్డేల్లో మాత్రం రెండు మ్యాచ్‌లే ఆడారు. సింప్సన్ 60వ దశకంలో అద్భుత స్లిప్ ఫీల్డర్‌గా పేరుతెచ్చుకున్నారు. ఆలెన్ బోర్డర్, మార్క్ టేలర్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు సింప్సన్ కోచ్‌గా వ్యవహరించి జట్టును ఉన్నత స్థితిలో నిలిపారు. సింప్సన్ తొలిసారిగా 1968లో ఆటకు వీడ్కోలు పలికారు. కానీ, మరో తొమ్మిదేళ్ల తర్వాత 41 ఏళ్ల వయస్సులో కెప్టెన్‌గా పునరాగమనం చేసి ఏడాది పాటు జట్టుకు ఆడారు.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి