Share News

India Women cricket: మనమ్మాయిలు పోరాడినా

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:56 AM

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ చేజిక్కించుకొని చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళలు త్రుటిలో కోల్పోయారు. శనివారం జరిగిన నిర్ణాయక మూడో వన్డేలో 43 పరుగులతో హర్మన్‌ సేన ఓటమి చవిచూసింది....

India Women cricket: మనమ్మాయిలు పోరాడినా

కొద్దిలో చేజారిన 413 పరుగుల ఛేదన

శతక్కొట్టిన బేత్‌ మూనీ

మంధాన సూపర్‌ సెంచరీ

దీప్తి మెరుపు ఇన్నింగ్స్‌

ఆస్ట్రేలియాదే సిరీస్‌

మూడో వన్డేలో భారత్‌ ఓటమి

ముంబై: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ చేజిక్కించుకొని చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళలు త్రుటిలో కోల్పోయారు. శనివారం జరిగిన నిర్ణాయక మూడో వన్డేలో 43 పరుగులతో హర్మన్‌ సేన ఓటమి చవిచూసింది. 413 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో స్మృతీ మంఽధాన (63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 125) సూపర్‌ సెంచరీ, దీప్తీశర్మ (58 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 72) మెరుపు బ్యాటింగ్‌కు తోడు హర్మన్‌ప్రీత్‌ (52) అర్ధ శతకంతో మన జట్టు లక్ష్యాన్ని చేరేలా కనిపించింది. కానీ వారి నిష్క్రమణ తర్వాత భారత పోరాటం 47 ఓవర్లలో 369 రన్స్‌ వద్దే ముగిసింది. అంతకుముందు ఆసీస్‌ 47.5 ఓవర్లలో 412 రన్స్‌కు ఆలౌటైంది. బేత్‌ మూనీ (75 బంతుల్లో 23 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 138) శతక్కొట్టగా, జార్జియా (81), పెర్రీ (68) అర్ధ శతకాలు చేశారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీ్‌సను ఆసీస్‌ 2-1తో దక్కించుకుంది. భారత్‌పై ఆసీ్‌సకిది 11వ ద్వైపాక్షిక సిరీస్‌ విజయం. మూనీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, స్మృతి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా నిలిచారు.


సంక్షిప్తస్కోర్లు

ఆస్ట్రేలియా: 47.5 ఓవర్లలో 412 ఆలౌట్‌ (బేత్‌ మూనీ 138, జార్జియా వోల్‌ 81, ఎలీస్‌ పెర్రీ 68, గార్డ్‌నర్‌ 39, అరుంధతి 3/86, దీప్తీశర్మ 2/78, రేణుకా సింగ్‌ 2/79).

భారత్‌: 47 ఓవర్లలో 369 ఆలౌట్‌ (మంధాన 125, దీప్తి 72 హర్మన్‌ 52, స్నేహ్‌రాణా 35, కిమ్‌ గార్త్‌ 3/69, మేఘన్‌ 2/53).

కోహ్లీ రికార్డ్‌ బ్రేక్‌

50 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతీ మంధాన.. వెటరన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (52 బంతుల్లో 100)ని అధిగమించి వన్డేలలో వేగవంతమైన శతకం చేసిన భారత బ్యాటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది. అలాగే మహిళల వన్డేలలో వేగవంతమైన సెంచరీ (50 బంతుల్లో 100) చేసిన రెండో బ్యాటర్‌గానూ స్మృతి నిలిచింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ (45 బంతుల్లో) టాప్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి

పైక్రాఫ్ క్షమాపణ వ్యవహారం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన పాక్

మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పారు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 05:57 AM