Share News

Australia Captain: భారత్‌తో సిరీస్‌కు కమిన్స్‌ దూరం

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:42 AM

వెన్నునొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ భారత్‌, న్యూజిలాండ్‌ దేశాలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలకు దూరం కానున్నాడు. వచ్చే నెలలో మూడు టీ20ల సిరీస్‌ కోసం...

Australia Captain: భారత్‌తో సిరీస్‌కు కమిన్స్‌ దూరం

సిడ్నీ: వెన్నునొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ భారత్‌, న్యూజిలాండ్‌ దేశాలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలకు దూరం కానున్నాడు. వచ్చే నెలలో మూడు టీ20ల సిరీస్‌ కోసం ఆసీస్‌ జట్టు కివీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత స్వదేశంలో భారత్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే నవంబరులో ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్‌ సిరీ్‌సలో కమిన్స్‌ ఆడే అవకాశం ఉందని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. జూలైలో వెస్టిండీ్‌సతో జరిగిన మూడో టెస్టులో తను చివరిసారి ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 03:43 AM