Share News

Asia Cup 2025: ఆసియా సమరానికి సై

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:41 AM

దుబాయ్‌: టీ20 ప్రపంచక్‌పనకు సన్నాహంగా భావిస్తున్న ఆసియాకప్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. యూఏఈలోని దుబాయ్‌, అబుధాబిలో మంగళవారం నుంచి ఈనెల 28 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీంతో రానున్న 20 రోజుల పాటు...

Asia Cup 2025: ఆసియా సమరానికి సై

ఎనిమిది జట్ల పోరు నేటి నుంచి

తొలి మ్యాచ్‌లో అఫ్ఘాన్‌తో హాంకాంగ్‌ ఢీ

జోష్‌లో టీమిండియా

రాత్రి 8 గం. నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

ఇంగ్లండ్‌లో పర్యటన తర్వాత టీమిండియా మరోసారి మైదానంలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈసారి ఫార్మాట్‌ మారింది. ధనాధన్‌ ఆటతో.. ఎడారి దేశంలో తుఫాన్‌ సృష్టించేందుకు జట్టు సిద్ధమైంది. ఉపఖండ జట్ల మధ్య నేటి నుంచి జరిగే ఆసియా కప్‌లో సూర్యకుమార్‌ సేన మరింత జోష్‌తో బరిలోకి దిగుతోంది. ట్రోఫీ కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నా, ఎనిమిది సార్లు విజేత భారతే ఫేవరెట్‌. స్టార్లు విరాట్‌, రోహిత్‌ లేకుండా బరిలోకి దిగుతున్న మన జట్టు.. టోర్నీలో తన పోరును యూఏఈతో బుధవారం ఆరంభించనుంది. ఇక టోర్నీకే హైలైట్‌గా నిలిచే ఇండో-పాక్‌ సమరం ఈనెల 14న జరగనుంది.

దుబాయ్‌: టీ20 ప్రపంచక్‌పనకు సన్నాహంగా భావిస్తున్న ఆసియాకప్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. యూఏఈలోని దుబాయ్‌, అబుధాబిలో మంగళవారం నుంచి ఈనెల 28 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీంతో రానున్న 20 రోజుల పాటు ఆసియాకు చెందిన ఎనిమిది జట్లు ధనాధన్‌ ఆటతీరుతో అభిమానులను అలరించబోతున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌-హాంకాంగ్‌ జట్లు అబుధాబిలో తలపడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ బుధవారం యూఏఈతో టైటిల్‌ పోరును ఆరంభించనుంది. గ్రూప్‌ ‘ఎ’లో టీమిండియాతో పాటు పాకిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌ ఉండగా.. గ్రూప్‌ ‘బి’ నుంచి శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, హాంకాంగ్‌ పోటీపడుతున్నాయి. ప్రతీ గ్రూప్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు వెళతాయి. అందులో రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తంగా ఇప్పటికి 15 సార్లు జరిగిన ఆసియాక్‌పలో రెండుసార్లు మాత్రమే టీ20 ఫార్మాట్‌లో ఆడించారు. 2023లో శ్రీలంకలో జరిగిన చివరి టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా, భారత్‌ విజేతగా నిలిచింది.


భారత్‌ షెడ్యూల్‌ (మ్యాచ్‌లన్నీ రాత్రి 8 నుంచి)

సెప్టెంబరు 10 యూఏఈతో దుబాయ్‌లో

సెప్టెంబరు 14 పాకిస్థాన్‌తో దుబాయ్‌లో

సెప్టెంబరు 19 ఒమన్‌తో అబుధాబిలో

పాక్‌తో పోరుపైనే కళ్లన్నీ..!

ఏ జట్టు ఎవరితో ఆడినా ఈనెల 14న దుబాయ్‌లో జరిగే భారత్‌-పాక్‌ పోరుపైనే అందరి దృష్టి ఉండనుంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాక్‌తో క్రికెట్‌ ఆడకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు జరుగకపోయినా.. ఐసీసీ, ఏసీసీ స్థాయిలో నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనవచ్చని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈసారి పాక్‌ స్టార్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ లేకపోవడంతో ఆ జట్టు కళ తప్పింది. అంతగా అనుభవంలేని యువ ఆటగాళ్లతో పాక్‌ బరిలోకి దిగుతున్నా ఇరు దేశాల అభిమానులకు ఈ మ్యాచ్‌పై ఆసక్తి మాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఒకవేళ రెండు జట్లు ఫైనల్‌కు వస్తే మొత్తం మూడుసార్లు వీరి మధ్య పోరును తిలకించే చాన్సుంది.


000000sports.jpg

భారత్‌కు పోటీ ఉంటుందా?

ఆసియాక్‌పలో బరిలోకి దిగిన ప్రతీసారి భారత జట్టును ఫేవరెట్‌గానే పరిగణిస్తుంటారు. ఈసారి కూడా మిగతా జట్ల నుంచి ఏమేరకు పోటీ ఎదురవుతుందో చూడాలి. కాస్తయినా సవాల్‌ విసరగల పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు ప్రస్తుతం సంధి దశలో ఉన్నాయి. అంతా సవ్యంగా జరిగితే సూర్యకుమార్‌ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిదో టైటిల్‌ను ఖాతాలో వేసుకోగలుగుతుంది. రోహిత్‌, విరాట్‌, జడేజాలాంటి ఆటగాళ్లు లేకపోయినా జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక, రానున్న టీ20 వరల్డ్‌క్‌పనకు ముందు జట్టు బలాబలాలపై కూడా ఆసియా కప్‌ ద్వారా స్పష్టత రానుంది. ఇంగ్లండ్‌లో భీకర ఫామ్‌ చాటుకున్న వైస్‌కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ జట్టులో చేరడం మరింత సానుకూలాంశం కానుంది. 15 మందిలో అందరూ ప్రతిభావంతులే కావడంతో తుది జట్టు ఎంపిక కూడా సమస్య కాబోతోంది. అందుకే సంజూ శాంసన్‌ చోటుపై సందేహాలు నెలకొన్నాయి. యూఏఈలో పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించనుండడంతో అక్షర్‌, కుల్దీప్‌, వరుణ్‌ ఆడనున్నారు. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌ శర్మ వైపు మొగ్గు చూపవచ్చు. తొలి మ్యాచ్‌ యూఏఈతో అయినప్పటికీ స్టార్‌ పేసర్‌ బుమ్రాను ఆడించనున్నట్టు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్‌, గిల్‌ ఆ తర్వాత తిలక్‌, సూర్య, హార్దిక్‌, అక్షర్‌, జితేశ్‌ రానున్నారు.

భారత జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), గిల్‌, అభిషేక్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, అక్షర్‌, కుల్దీప్‌, జితేశ్‌, శాంసన్‌, వరుణ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, దూబే, రింకూ సింగ్‌, హర్షిత్‌ రాణా.

కామెంట్రీ ప్యానెల్‌లో సన్నీ, వీరూ

ఆసియాకప్‌ టీ20 టోర్నీ కోసం సోనీ నెట్‌వర్క్‌ తమ కామెంట్రీ ప్యానెల్‌ను వెల్లడించింది. ఇందులో భారత్‌ నుంచి గవాస్కర్‌, రవిశాస్త్రి, మంజ్రేకర్‌, ఊతప్ప ఇంగ్లి్‌షలో.. వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌, అజయ్‌ జడేజా, సాబా కరీమ్‌, అభిషేక్‌ నాయర్‌ హిందీలో తమ కామెంట్రీతో అలరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 02:41 AM