Share News

Ashes 2025 Mitchell Starc Dominates: ఓటమి దిశగా ఇంగ్లండ్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:11 AM

యాషెస్‌ సిరీ్‌సలో ఆస్ట్రేలియా వెటరన్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్‌లో పది వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన మిచెల్‌..రెండో టెస్ట్‌లో అటు బౌలింగ్‌తోపాటు ఇటు...

Ashes 2025 Mitchell Starc Dominates: ఓటమి దిశగా ఇంగ్లండ్‌

ఆసీస్‌తో యాషెస్‌ రెండో టెస్ట్‌

బ్రిస్బేన్‌: యాషెస్‌ సిరీ్‌సలో ఆస్ట్రేలియా వెటరన్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్‌లో పది వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన మిచెల్‌..రెండో టెస్ట్‌లో అటు బౌలింగ్‌తోపాటు ఇటు బ్యాటింగ్‌లోనూ ఇంగ్లండ్‌ను వణికించాడు. ఇక్కడ జరుగుతున్న డే/నైట్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన స్టార్క్‌..అర్ధ సెంచరీతో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ టెస్ట్‌లోనూ ఇంగ్లండ్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 177 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ లోటుతో..రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ మూడోరోజు ఆఖరికి 134/6 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 378/6తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కంగారూలు 511 రన్స్‌ చేశారు. స్టార్క్‌ (77), బోలాండ్‌ (21 బ్యాటింగ్‌) తొమ్మిదో వికెట్‌కు 75 రన్స్‌ జోడించారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 334 రన్స్‌ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 06:11 AM