Arjun Irrigasi Semifinal:సెమీఫైనల్లో అర్జున్
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:02 AM
భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్ సెమీఫైనల్‌కు దూసుకుపోయాడు.
లాస్‌వెగాస్ (యూఎ్‌సఏ): భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్ సెమీఫైనల్‌కు దూసుకుపోయాడు. అయితే మరో జీఎం ప్రజ్ఞానంద క్వార్టర్‌ఫైనల్లో ఓటమి చవిచూశాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో అర్జున్ 1.5-0.5తో ఉజ్బెకిస్థాన్ జీఎం అబ్దుసత్తోరోవ్‌పై విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన మరో క్వార్టర్‌ఫైనల్లో అమెరికాకు చెందిన కరువాన 4-3తో ప్రజ్ఞానందను ఓడించాడు. దీంతో ప్రజ్ఞానంద టైటిల్ రేసు నుంచి నిష్క్రమించాడు. అమెరికా ఆటగాళ్లు ఆరోనియన్, హాన్స్ నీమన్ కూడా సెమీస్ చేరారు. సెమీఫైనల్స్‌లో ఆరోనియన్‌తో అర్జున్, కరువానతో నీమన్ అమీతుమీ తేల్చుకుంటారు. ఐదో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నెం.1 కార్ల్‌సన్ 2-0తో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజ్‌రాతీపై నెగ్గాడు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి