FIDE Grand Swiss 2025: అర్జున్‌కు డ్రా హారికకు గెలుపు
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:19 AM
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో అర్జున్ ఇరిగేసి ఆరో రౌండ్‌ను డ్రా చేసుకోగా.. గుకేష్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌లో...
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో అర్జున్ ఇరిగేసి ఆరో రౌండ్‌ను డ్రా చేసుకోగా.. గుకేష్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌లో ఫర్హమ్ మక్సూద్ (ఇరాన్)తో అర్జున్ పాయింట్ పంచుకోగా..నికోలస్ థియోడొరో (గ్రీస్) చేతిలో గుకేష్ ఓడాడు. ప్రజ్ఞానంద, దివ్య, హరికృష్ణ గేమ్‌లు డ్రాగా ముగిశాయి. మహిళల విభాగంలో గుల్‌రుక్‌బెగిమ్ (ఉజ్బెకిస్థాన్)పై హారిక, లీనా (అల్జీరియా)పై వంతిక గెలవగా.. వైశాలి గేమ్ డ్రా చేసుకొంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి