FIDE Chess World Cup: టైబ్రేక్‌కు అర్జున్ హరి
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:00 AM
ఫిడే చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్‌ను డ్రా చేసుకొన్నారు. దీంతో గురువారం జరిగే టైబ్రేక్‌లో ఫలితం తేలనుంది. బుధవారం జరిగిన...
ప్రజ్ఞానంద కూడా..
కార్తీక్ అవుట్
పనాజి: ఫిడే చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్‌ను డ్రా చేసుకొన్నారు. దీంతో గురువారం జరిగే టైబ్రేక్‌లో ఫలితం తేలనుంది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 36 ఎత్తుల అనంతరం పీటర్ లెకో (హంగేరీ)తో డ్రాకు అంగీకరించాడు. దీంతో ఇద్దరూ 1-1తో సమంగా నిలిచారు. గ్రాండిల్‌స (స్వీడన్)తో రెండో గేమ్‌ను హరికృష్ణ 38 ఎత్తుల్లో డ్రా చేసుకొన్నాడు. డేనియల్ దుబోవ్‌తో ప్రజ్ఞానంద పాయింట్ పంచుకొన్నాడు. కాగా, కార్తీక్ వెంకట్రామన్ 0.5-1.5తో లి క్వాంగ్ లియమ్ (వియత్నాం) చేతిలో, ప్రణవ్ 0.5-1.5తో నోడిబెక్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి